పంత్‌‌లో‌ విశ్వాసం పెరిగింది.. ఏ స్థానంలో అయినా ఓకే: మైక్ హ్యుసన్

by Shyam |
పంత్‌‌లో‌ విశ్వాసం పెరిగింది.. ఏ స్థానంలో అయినా ఓకే: మైక్ హ్యుసన్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ తనదైన ముద్ర వేశాడు. విమర్శలకు చెక్‌ పెడుతూ.. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో అతడి బ్యాటింగ్‌ శైలి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌ను అదరగొట్టాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మాన్. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పటికీ సరైన సమయంలో బౌండరీలు బాదుతూ రిషబ్ ప్రత్యర్థులకు సవాల్‌గా మారుతుంటాడు. అటువంటి ఆటగాడిపై స్టార్ స్పోర్ట్స్ నెటిజన్లకు ఓ సలహా అడిగింది. జూన్ 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో రిషబ్ పంత్ ఆర్డర్‌ను పెంచాలా.. దీనిని ప్రొత్సహిస్తారా అంటూ ప్రశ్న వేసింది. దీనికి నెటిజన్లతో పాటు మాజీ క్రికెటర్ల కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే విషయంపై న్యూజీలాండ్ క్రికెట్ కోచ్, (బెంగళూరు క్రికెట్ ఆపరేషన్ డైరెక్టర్) మైక్ హ్యూసన్ పంత్‌పై ధీమా వ్యక్తం చేశాడు. ‘పంత్ తన ఆటతీరుపై మరింత విశ్వాసంగా ఉన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై మరింత స్థిరపడ్డాడు. అతను ఆడాలనుకున్న విధంగా ఆడగలడు.. అంటూ ఏ స్థానంలో అయినా రాణించగలడు అంటూ చెప్పకనే చెప్పాడు మైక్ హ్యూసన్.

Advertisement

Next Story