అవినీతి.. ఆడిట్​.!

by Shyam |
అవినీతి.. ఆడిట్​.!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పంచాయతీలే ప్రగతికి పట్టుగొమ్మలన్న ఆలోచనతో టీఆర్​ఎస్ ​ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే నూతన పంచాయతీరాజ్ చట్టం–2018ను అమల్లోకి తెచ్చింది. అందుకనుగుణంగా జీపీలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుండగా, కొందరు సర్పంచులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రతి నెలా రూ.లక్ష లు స్వాహా చేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. కాగా, ఆడిట్​ద్వారా అవినీతిని నిగ్గు తేల్చాల్సిన అధికారులు, పాలకవర్గాలతో జతకడుతున్నారు. క్లీన్​చిట్ ​కోసం నిధుల టర్నోవర్​పై పర్సంటేజీ డిమాండ్​ చేస్తున్నారు. ‘తిలాపా పం.. తలా పిడికెడు…’ అన్న చందంగా ఆడిట్​సమయంలో జీపీల వారీగా రూ. 30 వేల నుంచి రూ. లక్ష చొప్పున వ సూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఏడాదికి ఐదు సంస్థల ద్వారా రూ. 7 కోట్లు .!

జిల్లాలో మొత్తం 530 నోటిఫైడ్ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల్లో పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, వీ ధిలైట్ల నిర్వహణ, డ్రైనేజీలు, కల్వర్టులు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయి. ఒక్కో వ్యక్తికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ప్రతి నెలా రూ.335, అలాగే కేం ద్రం ద్వారా 15 వ ఆర్థిక సంఘం కింద రూ.201.46 పై చొప్పున గ్రాంట్ వస్తుంది. వీటికి తోడు గతంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన 14వ ఆర్థిక సంఘం మిగులు బడ్జెట్ ను కూడా సర్కారు ఇటీవల విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్కో వ్యక్తికి నెలకు రూ.427.52 చొప్పున నిధులు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్ సీ నిధులను జూన్ నెల వరకు విడుదల చేసింది. ఇవిగాక కేంద్రం నుంచి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, రిజిస్ట్రేషన్, మై నింగ్ శాఖలకు వచ్చే ఆదాయంలో 25 శాతం నిధులు, ఎ మ్మెల్యేలు, మంత్రులకిచ్చే సీడీపీ నిధుల్లో కూడా 75 శాతం కోత విధించి వాటిని కూడా ప్రభుత్వం పంచాయతీలకే మ ళ్లిస్తోంది. ఇలా అనేక మార్గాల ద్వారా ఏడాదికి రూ. ఏడు కోట్ల నిధులు జీపీలకు ప్రభుత్వాలు విడుదల చేస్తున్నాయి.

భారీగా నిధుల స్వాహా. !

పంచాయతీ పాలకవర్గం అనుమతి, ఆమోదం లేకుండా చిల్లిగవ్వ ఖర్చు పెట్టడానికి వీల్లేకపోవడంతో కొందరు సర్పంచులు తమ దోపిడీకి ప్రధానంగా పారిశుధ్యం, వీధి లైట్లు, తాగునీరు తదితర వాటిని ఆయుధంగా మలుచుకున్నారు. బహిరంగ మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీ ఎల్ఈడీ బల్బులు, ప్యానల్ వీధిలైట్లు కొంటే వాటికి ఏడాది కాలం పాటు వారంటీ ఉంటుంది. ఆ లోగా కాలిపోతే దుకాణాదారుడే వాటిని మార్చి కొత్తవి ఉచితంగా ఇస్తారు. గ్రామాల్లో ఉపయోగించే 15 వాట్స్ ఎల్ఈడీ బల్బు 175 రూ.లు, 30 వాట్స్ స్ట్రీట్ లైట్ రూ. 1700 మించి ఉండదు. ఏ మే జర్ పంచాయతీ పరిధిలో నైనా విద్యుత్ స్తంభాల సంఖ్య వెయ్యి లోపే ఉంది. అయితే కొందరు సర్పంచ్​లు కరెంటు బల్బుల కొనుగోలు పేరిట బోగస్ బిల్లులను సమర్పించి ప్రతి నెల రూ. లక్షల్లో నిధులను కా జేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జీపీ నిధుల ఖర్చులో సుమారు 40 శాతం మేరకు కరెంటు బల్బుల కొనుగోలు బిల్లులే ఉంటున్నాయని బోధన్ మండలంలోని ఓ గ్రామ ఉప సర్పంచ్ వాపోయారు. ఇక రూ. ఐదు వేలలోపు కూలీలతో శానిటేషన్, తాగునీటి పైప్ లైన్ లీకేజీల మరమ్మతు పనులు చేయించవచ్చు. అయితే ఓచర్లు, మస్టర్ల ద్వారా కూలీలకు చెల్లింపులు జరిపే ముందు వాటిపై సంబంధిత ఇంజినీర్ల ధ్రువీకరణ అవసరం. అవేవీ లేకుండా సర్పంచ్​లు విచ్ఛలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలూ ఉన్నాయి.

నామమాత్రంగా కార్యదర్శులు

నిధులు డ్రా చేసే సర్వాధికారాలన్నీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకే ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు నామమాత్రమే. చెక్కుల జారీ సమయంలో తమ సెల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ చెప్పడమే వారి బాధ్యతగా మారిందనే ఆరోపణలున్నాయి. కోటగిరి మండలంలోని ఇద్దరు సర్పంచులు ఏడాది వరకు కార్యదర్శితో సంబంధం లేకుండానే ఉప సర్పంచ్ తో కలిసి బిల్లులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. సర్పంచ్, ఉప సర్పంచ్ ల నిధుల స్వాహాను అరికట్టలేని చోట ఉన్నతాధికా రుల విచారణలో సెక్రటరీలు కూడా బలిపశువులుగా మారుతున్నారు. గల్లీల్లో అభివృద్ధి పనులు చేసుకునే వార్డు సభ్యులను సైతం వదలని సర్పంచ్​లు వారి నుంచి 10 శాతం ప ర్సంటేజీలను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. జిల్లాలోని నందిపేట్, వేల్పూర్ మండలంలోని పోచంపాడ్ జీపీల్లో ఇ లాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. నందిపేట్ లో రూ. 72 లక్షల మేరకు జరిగిన నిధుల గోల్​మాల్ వ్యవహారంలో బాధ్యులందరూ సస్పెండ్ అయ్యారు. వర్ని మండలంలోని మూడు గ్రామాలు, బోధన్ లో ఐదు, కోటగిరి మండలంలో ని మూడు మూడు పంచాయతీల్లో ఉపసర్పంచ్, సర్పంచ్​ల మధ్య రాజీ కుదరక పొగ రాజు కుంటున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed