సాగర్ రెండవ జోన్ కు నీటిని విడుదల చేసిన పాలేరు ఎమ్మెల్యే

by Sridhar Babu |
paleru mla
X

దిశ, పాలేరు: వానకాలం సాగు కోసం పాలేరు జలాశయం నుంచి సాగర్ రెండవ జోన్ కి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్ తో కలిసి రిజర్వాయర్ నుంచి గురువారం నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతానికి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసి క్రమంగా పెంచనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు సాగు నీటిని అందించడం గొప్ప విషయమని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. నియోజకవర్గ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

నాగార్జున సాగర్ ద్వారా రెండు మూడు రోజుల్లో జలాశయానికి నీరు రానున్న నేపథ్యంలో ముందుగా కురిసిన వర్షాలకు రిజర్వాయర్ నిండడంతో ఇది సాధ్యమైందన్నారు. సాగర్ రెండవ జోన్ రైతుల సాగు అవసర నిమిత్తం నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నారని, గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాల వికాసానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఎంపీపీలు శ్రీనివాస్, మంగిలాల్, ఏఏంసీ నేలకొండపల్లి చైర్మన్ సెట్రం, సీడీసీ చైర్మన్ గోపాల్ రావు, ఇరిగేషన్ డీఈ రత్న కుమారి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story