చిత్తూరు జిల్లాలో పాకిస్థానీ?

by srinivas |
చిత్తూరు జిల్లాలో పాకిస్థానీ?
X

చిత్తూరు జిల్లాలో పాకిస్థానీ హల్‌చల్ చేయడం కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే… తొట్టంబేడు మండలంలోని చియ్యవరంలో గుర్తుతెలియని వ్యక్తి (41) గత రాత్రి చిన్న బ్యాగుతో కనిపించాడు. దీంతో అతనిని గ్రామస్థులు ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అంటూ ప్రశ్నించారు. దీంతో పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు ఆయన హిందీలో చెప్పాడు. తనతో పాటు మరో నలుగురు వచ్చినట్టు వెల్లడించాడు. దీంతో పాక్ నుంచి కరోనా అంటించేందుకు వచ్చాడన్న ఆందోళనతో అతనిని చుట్టుముట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో ఉన్న సంచిలో ఏవో కాయలుండగా, వాటిని మత్తుకాయలుగా భావించి జనం ఆందోళన చెందారు.

Tags: chittoor district, pakistani, thottambedu, police

Advertisement

Next Story

Most Viewed