పాకిస్తాన్ ప్రముఖ గాయకుడి హత్య

by vinod kumar |
పాకిస్తాన్ ప్రముఖ గాయకుడి హత్య
X

దిశ, వెబ్‎డెస్క్: పాకిస్థాన్‌ ప్రముఖ గాయకుడు హనీఫ్ చమ్రోక్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్సులోని టర్బాట్ పట్టణంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. సింగర్ హనీఫ్ తన ఇంటి బయట విద్యార్థులకు సంగీత పాఠాలు చెబుతున్న సమయంలో బైక్‌పై వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హనీఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకు గురైన హనీఫ్ మహిళా హక్కుల కార్యకర్త తయాబా బలూచ్ తండ్రి. బలూచిస్థాన్‎లో భద్రతాదళాలను లక్ష్యంగా చేసుకొని వేర్పాటు వాదులు తరచూ దాడులు చేస్తున్న క్రమంలో తయాబా బలూచ్ తండ్రిని కాల్చి చంపడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనీఫ్‎ను కాల్చిన తర్వాత దుండగులు పారిపోయారని, ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story