- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్రలో తొలిసారి.. పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం
దిశ, వెబ్‌డెస్క్: టీ 20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. దాయాది జట్టు పాకిస్తాన్.. భారత్‌పై 10 వికెట్ల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. నిర్ణీత 20 ఓవర్లకు 151 పరుగులు చేసిన విరాట్ సేన బౌలింగ్‌లో పూర్తిగా విఫలం అయింది. పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్ (68 నాటౌట్) , మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్)గా నిలిచి జట్టును అవలీలగా గెలిపించుకున్నారు. 17.5 ఓవర్లలోనే 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. కాగా, టీ 20 చరిత్రలోనే టీమిండియాపై ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాక్ విజయం సాధించడం విశేషం. దీంతో అభిమానులు టీమిండియాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
భారత్ బ్యాటింగ్..
టాప్ ఆర్డర్‌లో వచ్చిన రోహిత్ (0), కేఎల్ రాహుల్ (3), సూర్య కుమార్ యాదవ్ (11)లు దారుణంగా విఫలమయ్యారు. ఈ ప్రభావం స్కోరు బోర్డుపై పడింది. దీంతో స్కోరు బోర్డు ముందుకు కదలడమే కష్టంగా మారింది.
అప్పటికే క్రీజులోకి వచ్చిన కోహ్లీ వికెట్ కాపాడుకుంటూ వచ్చాడు. ఇదే సమయంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్ రిషబ్ పంత్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీకి తోడుగా తన వంతు కృషి చేశాడు. 30 బంతుల్లో (39) పరుగులు తీసి పెవిలియన్ చేరాడు. దీంతో 84 పరుగులకే నాలుగో వికెట్ కోల్పోయింది భారత్.
ఆ తర్వాత కాస్తా వేగాన్ని పెంచిన కోహ్లీ 45 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్ రవీంద్ర జడేజా కూడా 13 పరుగులకే క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్‌గా హార్దిక్ వచ్చిన కాసేపటికే షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో విరాట్ (57) పరుగుల వద్ద కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక డెత్ ఓవర్‌లలో క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా (11) పరుగులకు ఔట్ అయ్యాడు. భువనేశ్వర్ (5), షమీలో(0) క్రీజులో ఉండగా నిర్ణీత ఓవర్లు ముగిశాయి. దీంతో 7 వికెట్ల నష్టానికి భారత్ 151 పరుగులు చేసింది.