- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
‘బౌలౌట్ నిబంధనపై పాక్‌కు అవగాహన లేదు’
దిశ, స్పోర్ట్స్: 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్(First T20 World Cup)ను భారత జట్టు గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫైనల్స్‌లో పాకిస్తాన్ జట్టు (Pakistan team)ను ఓడించి భారత్ తొలి టైటిల్ నెగ్గింది. అయితే, అదే టోర్నీలో లీగ్ దశ (League stage)లో పాకిస్తాన్‌తో జరిగిన ఒక ఉత్కంఠభరిత మ్యాచ్ టై (Match tie) అయ్యింది. అప్పటికి సూపర్ ఓవర్ (Super over) నిబంధన లేకపోవడంతో బౌలౌట్ (Bowl-out) ద్వారా విజేతను నిర్ణయించారు.
అయితే, ఇన్నేళ్ల తర్వాత దీనిపై భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ (Former India bowler Irfan Pathan) స్పందించాడు. ఒక టీవీ షోలో అతడు మాట్లాడుతూ.. అసలు పాక్ జట్టుకు బౌలౌట్ (Bowl-out) అంశంపై పెద్దగా అవగాహన లేదని చెప్పాడు.
‘ఈ అంశాన్ని అప్పటి కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (Captain Misbah-ul-Haq) ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మాకు బౌలౌట్ (Bowl-out)పై పెద్దగా అవగాహన లేదని, ఇక బౌలౌట్ (Bowl-out)కు వచ్చేసరికి పూర్తి రనప్‌తో బౌలింగ్ (BOwling) చేయాలా, లేక సగం రనప్‌తో బంతి విసరాలా అనే అంశంలో వాళ్లకు స్పష్టత లేదు’ అని ఇర్ఫాన్ అన్నాడు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడిన రాబిన్ ఊతప్ప (Robin Uthappa) ‘మాకు బౌలౌట్ (Bowl-out) శిక్షణను అప్పటి కోచ్ వెంకటేశ్ ప్రసాద్ ముందు నుంచే ఇచ్చారు. ఖాళీ సమయంలో ఫుట్‌బాల్ (Football) ఆడనీయకుండా నాతో పాటు సెహ్వాగ్ (Sehwag), రోహిత్ శర్మ (Rohit Sharma)లతో బౌలౌట్ (Bowl-out) చేయించేవాడు. అప్పట్లో ఏనాడూ వికెట్ (Wicket) మిస్ చేసే వాళ్లం కాదు. ఇక పాకిస్తాన్ మ్యాచ్ రోజు నేనే నేరుగా వెళ్లి బౌలింగ్ చేస్తా అనగానే ధోనీ వెంటనే ఒప్పుకున్నాడు. స్వతహాగా బౌలర్‌ను కానప్పటికీ నాపై ఉన్న నమ్మకంతో అతడు ఈ అవకాశాన్ని నాకిచ్చాడు’ అని ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.