- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రుషికొండ ప్యాలెస్ చూస్తే నాకు కళ్ళు తిరిగాయి’.. సీఎం చంద్రబాబు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Assembly budget meetings) కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్ సమావేశంలో(budget meetings) ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను చూస్తే నాకు కళ్ళు తిరిగాయని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. గత ప్రభుత్వంలో అడవి పందుల లాగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని సీఎం చంద్రబాబు ఫైరయ్యారు. గతంలో పెట్టుబడులు పెడతామని వచ్చిన వారిని తరిమికొట్టారని విమర్శించారు. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహించారు.
ఇక ఆ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులకు కూడా ఆఫీసులు కట్టారు. అంతటి అరాచక పాలన భరించలేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఏపీకి వచ్చి నాలుగైదు నెలలు ఉండి NDAని గెలిపించి వెళ్లారు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడి పోటీ చేశామని అన్నారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి 93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర అని చెప్పారు. ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్, ప్రజలు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని దాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.