ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట.. విశ్వాస పరీక్ష పాస్

by vinod kumar |
pakistan pm imran khan
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట. శనివారం పాకిస్థాన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో ఆయన నెగ్గారు. నేషనల్ అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ విశ్వాస పరీక్షలో ఆయనకు 178 ఓట్లు వచ్చాయి. 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఇమ్రాన్ ఖాన్‌కు 170 ఓట్లు అవసరం కాగా.. ఆయనకు 178 మంది మద్దతు పలికారు. విశ్వాస పరీక్ష సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం పీపీపీతో పాటు పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం – ఇది 11 పార్టీల కూటమి) సభ్యులంతా నేషనల్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం.

ఇటీవలే జరిగిన సెనేట్ ఎన్నికలలో పాలక పార్టీకి చెందిన అభ్యర్థి అబ్దుల్ హఫీజ్ షేక్.. పీడీఎం అభ్యర్థి, మాజీ ప్రధాని సయూద్ యూసుఫ్ రజా గిలానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రజల విశ్వాసం కోల్పోయారనీ, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఆయన విశ్వాస పరీక్షకు ఓకే చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed