జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్‌ చొరబాటుదారుడిపై కాల్పులు

by Shamantha N |   ( Updated:2021-05-18 20:53:59.0  )
జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్‌ చొరబాటుదారుడిపై కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా-పాకిస్తాన్ బార్డర్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించిన పాకిస్తాన్‌ చొరబాటుదారుడిపై భారత సెక్యూరిటీ ఫోర్స్(BSF) పట్టుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు నుంచి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కాల్పులు జరిపినట్టు భద్రతా దళాలు తెలిపాయి. అనంతరం అతడిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు చొరబాటుదారుడు లాహోర్ నుంచి భారత్‌లోకి వచ్చాడని.. సైనికులు జరిపిన కాల్పుల్లో నాలుగు బులెట్ గాయాలు అయ్యాయని.. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారి తెలిపారు. సదరు వ్యక్తి నుంచి అధికారులు మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story