టీమిండియాపై పాకిస్తాన్ బౌలర్ సంచలన కామెంట్

by Anukaran |
టీమిండియాపై పాకిస్తాన్ బౌలర్ సంచలన కామెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరజాయాన్ని మూటగట్టుకుంది. భారత్ గెలుపు ఖాయం అనుకున్న సమయంలో చేజేతులా ఓటమి చెంది అభిమానులను నిరాశపరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలం అయినా.. బౌలింగ్‌లో బాగా రాణించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ చేతులెత్తేయడంతో 36 పరుగులకే టీమిండియా ఆలౌట్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా టీమిండియాపై విమర్శలు చేశారు.

తాజాగా దీనిపై వివాదస్పద పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ మాలిక్ స్పందించారు. ఈ సందర్భంగా భాతర ఆటగాళ్లపై విమర్శలు చేశారు. ‘‘నిన్న రాత్రి మ్యాచ్‌ చూడలేకపోయాను. అందుకే ఈరోజు ఉదయం నిద్రలేవగానే టీమిండియా స్కోరు 369 ఉంటుందనుకున్నా.. వెంటనే కళ్లు నులుముకుని మరోసారి పరిశీలించాను. అప్పుడు అర్ధం అయింది అది 369 కాదు 36/9 అని. ఒక రిటైర్డ్‌ హర్ట్‌. పూడ్చలేని నష్టం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు బ్యాటింగ్‌ తీరు ఇలా అయిపోయింది’’ అంటూ అక్తర్‌ భారత జట్టుపై విమర్శలు చేశారు. అంతేగాకుండా ‘‘36 పరుగులకే ఆలౌట్‌ కావడం ఘోరమైన ప్రదర్శన. అయితే ఒక్క విషయంలో మాత్రం నాకు సంతోషంగా ఉంది. ఎట్టకేలకు వాళ్లు మా రికార్డును బ్రేక్‌ చేశారు. అయినా ఆటలో ఇవన్నీ సహజం. ఇలాంటి ప్రదర్శన కారణంగా బాణాల్లా దూసుకువచ్చే విమర్శలనూ భరించేందుకు సిద్ధంగా ఉండాలి. అది ఇప్పుడు మీ వంతు. మొత్తానికి ఇదొక బ్యాడ్‌ న్యూస్‌’’ అని అక్తర్ మరోసారి ఘాటుగా స్పందించాడు. ‘‘అయితే 2013లో జోహన్నస్ బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయితే.. నిన్న భారత జట్టు మా రికార్డును బ్రేక్ చేస్తూ.. 36 పరుగులకే ఆలౌట్ అయింది.’’ అని అక్తర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed