- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాను తలపించిన పెళ్లి వేడుక.. గాల్లోకి ఎగిరిన కరెన్సీ నోట్లు!
దిశ, ఫీచర్స్: వివాహం అనేది జీవితంలో ఓ అపురూప ఘట్టం. ఇలాంటి వేడుకను పదికాలాలపాటు గుర్తుంచుకోవాలి, పదిమంది గొప్పగా చెప్పుకోవాలని ప్రతిఒక్కరూ అనుకోవడం సహజం. ఈ మేరకు పెళ్లి వేడుకలను అంగరంగ వైభంగా నిర్వహించి, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడుతుంటారు. ఈ క్రమంలో పెళ్లికి వచ్చిన అతిథులపై పన్నీరు చల్లుతూ స్వాగతం పలుకుతారు. అయితే మనం చెప్పుకోబోయే పెళ్లిలో మాత్రం ‘వరుడి’కి కరెన్సీ నోట్లు, గులాబీపూల రేకులతో స్వాగతం పలికి అతిథులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
పాకిస్థాన్‌లోని మండి బహవుద్దీన్ సిటీలో జరిగిన పెళ్లి వేడుకలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి కోసం వరుడు హర్రాయ గ్రామం నుంచి మండి బహవుద్దీన్‌కు రావాల్సి ఉండగా, అతడు హెలికాప్టర్‌లో రావడం విశేషం. మ్యారేజ్ ఫంక్షన్ హాల్‌కు దగ్గరలోని ఫాలియా రోడ్‌పై ఈ హెలికాప్టర్ ల్యాండ్ కాగా, ఆయన రాకను పురస్కరించుకుని వరుడి సోదరులు గాలిలో కరెన్సీ నోట్లను ఎగిరేశారు. ఈ తతంగాన్ని చూసిన అతిథులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. కరెన్సీ నోట్లు ఎగురుతున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.