మోడీ ప్రతిపాదనకు పాక్ ఓకే

by Shamantha N |
మోడీ ప్రతిపాదనకు పాక్ ఓకే
X

న్యూఢిల్లీ : కరోనావైరస్(కోవిడ్ 19)పై సార్క్(సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) దేశాలు ఐక్యంగా పోరాడాలని, అందుకు తగిన వ్యూహరచన చేసేందుకు వీడియో కాల్ కాన్ఫరెన్స్‌ నిర్వహించుకోవాలని ప్రధాని మోడీ చేసిన ప్రతిపాదనను పాకిస్తాన్ అంగీకరించింది. సార్క్‌లోని ఎనిమిది సభ్య దేశాల ముందు ప్రధాని మోడీ శుక్రవారం ఈ ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనపై శుక్రవారం రాత్రి పాకిస్తాన్ స్పందించింది. సార్క్ దేశాల వీడియో కాల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లో కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు క్యాంపెయిన్ నిర్వహిస్తున్న జాఫర్ మిర్జా ఇందులో పాల్గొనబోతున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ కార్యాలయ ప్రతినిధి అయిషా ఫారూఖీ తెలిపారు.

Tags: coronavirus, saarc, video call conference, pakistan, accept

Advertisement

Next Story

Most Viewed