డిసెంబర్‌కి ముందే అవి కొనేయండి.. లేదంటే ఆ తర్వాత ధరల మోతే..

by Harish |
paints
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పటికే రిటైల్ ద్రవ్యోల్బణ ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ప్రజలపై మరో భారం తప్పేలా లేదు. దేశీయంగా ముడి సరుకుల వ్యయం, ఇంధన ఖర్చు అధికం అవుతున్నాయనే కారణాలతో పెయింట్ కంపెనీలు ధరలు పెంచనున్నట్టు స్పష్టం చేశాయి. ఖర్చులు పెరిగిపోతుండటంతో పాటు మార్జిన్‌లను కాపాడుకునేందుకు వరుస నెలల్లో ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. పెయింట్ పరిశ్రమలో దాదాపు 50 శాతం వాటాను కలిగిన ఏషియన్ పెయింట్, బెర్గర్ సంస్థలు డిసెంబర్‌లో 4-6 శాతం ధరలు పెంచే అవకాశాలున్నాయి.

ఇప్పటికే ఈ రెండు కంపెనీలు 8-10 శాతం ధరల పెంపును ప్రకటించాయి. దీంతో దిగ్గజ కంపెనీలే ధరల పెంచాలని నిర్ణయించడంతో ఇండిగో, నోబెల్ ఇండియా లాంటి కంపెనీలు సైతం ధరలు పెంచాలని భావిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది పెయింట్ ధరలు అత్యధికంగా 20 శాతం పెరగనున్నాయని, గత కొన్నేళ్లలో ఇదే అత్యధికమని తెలుస్తోంది. సరఫరా సమస్యలు తొలగుతున్నాయనే పరిస్థితుల మధ్య మార్జిన్ లాభాల కోసం కంపెనీ ఖచ్చితంగా ధరలను పెంచవచ్చని ఏషియన్ పెయింట్స్ ఎండీ, సీఈఓ అమిత్ సింగాల్ గతంలో అన్నారు.

Advertisement

Next Story