- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొక్కలతోనే పర్యావరణ అభివృద్ధి : వనజీవి రామయ్య
దిశ, ఖమ్మం రూరల్ : ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణ అభివృద్ధికి చేయాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అన్నారు. మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలో శనివారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూసుమంచి రేంజ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు.
పర్యావరణ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, సామాజిక వేత్త, పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత కడవెండి వేణు గోపాల్, ఆంధ్రాబ్యాంక్ టేకులపల్లి సొసైటీ వైస్ చైర్మన్ తమ్మినేని విజయలక్ష్మి, ఫారెస్ట్ కూసుమంచి రేంజ్ ఆఫీసర్ జోష్నా దేవి, డిప్యూటీ రేంజర్ పి.సురేష్ కుమార్, సర్పంచ్ సిద్దినేని కోటయ్య, పంచాయతీ కార్యదర్శి రాధ, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.