జైలులో పద్మజ అరుపులు, కేకలు..

by srinivas |
జైలులో పద్మజ అరుపులు, కేకలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లె జంట హత్య కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజలు మదనపల్లె సబ్ జైలులో ఉన్నారు. అయితే పద్మజ తన అరుపులు, కేకలతో వింతగా ప్రవర్తిస్తోంది. దీంతో బ్యారక్‌లో ఉండే తోటి ఖైదీలు భయపడుతున్నారు. ప్రస్తుతం కలియుగ యుద్ధం జరుగుతోంది.. శివుడు వస్తున్నాడు.. కలియుగం అంతమవుతుంది.. నన్నే లోపలేస్తారా అని అరుస్తోందని జైలు అధికారులు చెబుతున్నారు.

పురుషోత్తం నాయుడు కూడా ఒంటరిగా కూర్చొని నమస్కారాలు చేస్తున్నాడని.. ఒక్కోసారి ఏడుస్తున్నారని తెలిపారు. వారిద్దరిని మెరుగైన చికిత్స కోసం దంపతులను విశాఖకు తరలించాలని తిరుపతి వైద్యులు సూచించడంతో వారిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed