- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఆర్ఎస్ నుండి పడాల శ్రీనివాస్ సస్పెండ్.. నలుగురుపై కేసు…
దిశ, యాదగిరిగుట్ట: నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డిపై దాడికి యత్నించిన పడాల శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గొంగడి సునీత వెల్లడించారు. యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. శనివారం జరిగిన తుర్కపల్లి మండల అధ్యక్ష ఎన్నిక ఉదయం నుండి రాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ నడుమ సాగింది. అయితే ఈ ఎన్నికలో అధ్యక్ష పదవికి పడాల శ్రీనివాస్‌ను కాదని నరేందర్ రెడ్డిని ఎన్నుకున్నారు.
దీంతో ఈ ఎన్నికను జీర్ణించుకోలేకపోయిన పడాల శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి గొంగడి మహేందర్ రెడ్డిపై దాడి యత్నించి టీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించారనే ఆరోపణలతో 6 సంవత్సరాల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సునీత తెలిపారు. తుర్కపల్లి మండల కేంద్రంలో నిన్న రాత్రి దాడి చేసిన వ్యక్తులపై డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పడాల శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురుపై 5 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు తుర్కపల్లి ఎస్సై తెలిపారు.