- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మా దగ్గర ఉత్తమ పేస్ దళం ఉంది : విరాట్ కోహ్లీ
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాంగ్ పేసర్లు స్వింగ్‌తో మూడో మ్యాచ్‌ను గెలుస్తారని అందరూ అంటున్నారు. కానీ మా వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమమైన పేస్ దళం ఉందని.. గతంలో స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఇంగ్లాండ్ జట్టును వారి దేశంలోనే ఓడించామని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. బుధవారం నుంచి మొతేరా స్టేడియంలో డే/నైట్ టెస్టు జరగనున్న నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ‘ఇంగ్లాండ్ జట్టు బలాలు, బలహీనతలు మాకు మాకు తెలుసు. మా కంటే ఎక్కువ బలహీనతలు మా ప్రత్యర్థి జట్టులోనే ఉన్నాయి.
పేస్‌పిచ్ వాళ్లకు అనుకూలంగా ఉంటే అదే మాకు లాభం. ఎందుకంటే మా దగ్గర పటిష్టమైన పేస్ దళం ఉంది. గొప్ప ప్రదర్శన కోసం సిద్దంగా ఉన్నాము. గత డే/నైట్ టెస్టులో మేము 36 పరుగులకు ఆలౌట్ అయ్యామని గుర్తు చేస్తున్నారు. కానీ 2018లో న్యూజీలాండ్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ 58 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మేం ఒక విజయం సాధించి మరొకటి డ్రా చేయాలని భావించడం లేదు. మిగిలిన రెండూ గెలవాలనే కోరుకుంటున్నాం’ అని కోహ్లీ అన్నాడు. ఇక ధోనీ స్వదేశంలో సాధించిన అత్యధిక టెస్టు విజయాల గురించి ఆలోచించడం లేదు. బయటి వ్యక్తులతో పోల్చండి.. కానీ మన వాళ్లతో వద్దు అని కోహ్లీ అన్నాడు.