- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
oyo కీలక నిర్ణయం.. ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే ఆరు నెలల్లో 300 మంది టెక్ నిపుణులను నియమించుకోనున్నట్టు ప్రముఖ ఆతిథ్య సేవలరంగ సంస్థ ఓయో గురువారం వెల్లడించింది. ఎంట్రీ లెవల్ నుంచి సీనియర్ లీడర్‌షిప్ స్థాయిలలో ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నియామకాలు మెషీన్ లెర్నింగ్, డేటా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డెవలపర్ విభాగాల్లో కీలక నైపుణ్యం కలిగిన వారిని తీసుకోనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
భవిష్యత్తులో కంపెనీ కొత్త ఆవిష్కరణల ద్వారా వినియోగదారులకు సేవలందించాలని భావిస్తోందని, టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. దీనివల్ల హోటల్ యజమానులకు ఆదాయాలను పెంచడం, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు వీలవుతుందని కంపెనీ వివరించింది. చిన్న, మధ్య స్థాయి హోటళ్ల కోసం ప్రపంచ స్థాయి టెక్నాలజీ ప్రొవైడర్‌గా నిలిచే ప్రక్రియను వేగవంతం చేయడంలో ఈ కొత్త నియామకాలు కీలకంగా ఉండనున్నట్టు ఓయో అభిప్రాయపడింది. కాగా, కంపెనీ ఇప్పటికే 50 మంది మిడ్-లెవల్ టెక్ నిపుణులను దేశీయంగా ప్రధాన విశ్వవిద్యాలయాల నుంచి 150 మంది క్యాంపస్ రిక్రూట్‌లను చేపట్టిన సంగతి తెలిసిందే.