విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్న ఆక్సిజన్ రైలు…

by srinivas |
విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్న ఆక్సిజన్ రైలు…
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజు వేలల్లో కరోనా కేసులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి మే 1 వరకు సంపూర్ణ లాక్ డౌన్ కూడా విధించింది. భారత రైల్వే ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్రలో కరోనా ఉదృతి నేపథ్యంలో మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి మహారాష్ట్ర కు ఆక్సిజన్ తరలించేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి 150 టన్నుల ఆక్సిజన్ ను రైలులో ఏర్పాటు చేసిన ట్యాంకర్ల ద్వారా పంపిస్తున్నారు. ఆక్సిజన్ లోడింగ్ తరువాత తిరిగి రైలు మహారాష్ట్రకు బయలుదేరనుంది.

Advertisement

Next Story

Most Viewed