ఇరాక్ హాస్పిటల్‌లో పేలిన ఆక్సిజన్ ట్యాంక్

by Sridhar Babu |
ఇరాక్ హాస్పిటల్‌లో పేలిన ఆక్సిజన్ ట్యాంక్
X

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఓ హాస్పిటల్‌లో ఘోర అగ్నిప్రమదం జరిగింది. హాస్పిటల్‌లోని ఆక్సిజన్ ట్యాంక్ పేలి హాస్పిటల్ మొత్తం మంటలు వ్యాపించాయి. బాగ్దాద్‌లోని ఇబ్న్ అల్ ఖతిబ్ హాస్పిటల్‌లో శనివారం జరిగిన ఘటనలో 82 మంది మరణించిన ఇరాక్ ఇంటీరియర్ మినిస్ట్రీ ప్రతినిధి వెల్లడించారు. కనీసం 110 మందికి గాయాలయ్యాయని వివరించారు. వెంటిలేటర్‌ సపోర్టుతో ఉన్న కనీసం 28 మంది పేషెంట్లను తరలించాల్సి వచ్చిందని ఇరాక్ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. దియాల బ్రిడ్జీ ఏరియాలోని ఈ హాస్పిటల్‌లో తొలుత ఓ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, అటుతర్వాత ఆక్సిజన్ ట్యాంక్ పేలిందని స్థానికులు చెప్పారు.

ఈ కొవిడ్ హాస్పిటల్‌ పైఅంతస్థుల్లోనూ మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది పేషెంట్లకు ఊపిరాడక మరణించారు. పై అంతస్థుల నుంచి పేషెంట్లు, వారి బంధువులు, వైద్యులూ కిందికి దూకుతూ కనిపించారని ఓ వ్యక్తి వివరించారు. సోషల్ మీడియాలో ఆరోగ్య శాఖ మంత్రిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనను వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. అనంతరం ప్రధానమంత్రి ముస్తఫా అల్ ఖాదేమీ హెల్త్ మినిస్టర్ హస్సన్ అల్ తమీమీని బాధ్యతల నుంచి తొలగించారు. ఘటనకు బాధ్యులైన వారిని వదలిపెట్టబోమని ఆయన హామీనిచ్చారు. గవర్నర్ సహా అందరిపైనా దర్యాప్తునకు ఆదేశించారు. మూడు రోజుల సంతాప దినంగా ప్రకటించారు.

Advertisement

Next Story