సవాళ్లను అధిగమిస్తూ ఆక్సిజన్ సరఫరా

by srinivas |
Oxygen Express
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఊహించని అనేక సవాళ్లను అధిగమిస్తూ అన్ని రాష్ట్రాలకు ద్రవరూప వైద్య ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతీయ రైల్వే నూతన అన్వేషణలతో దేశానికి సేవలందిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 రోజుల వ్యవధిలోనే 33 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ల ద్వారా సుమారు 2,125.6 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఓ చేరవేశామన్నారు.

రాష్ట్రానికి కావాల్సిన వైద్య ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు నడిపినట్లు తెలిపారు. ఆక్సిజన్‌ రైళ్లు వీలైనంత త్వరగా చేరేలా పర్యవేక్షణకు రైల్వేలో వివిధ విభాగాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దీంతో ఈ రైళ్లు సగటున గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయని వెల్లడించారు. క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైద్య ఆక్సిజన్‌ సరఫరా చేయడంలో శ్రమిస్తున్న అధికారులను, సిబ్బందిని అభినందించారు. రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆయన రైల్వే బృందాలకు సూచించారు.

Advertisement

Next Story