- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాలాగూడలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రిలో 500 ఎల్పీఎం సామర్ధ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమైంది. బుధవారం రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందేవారికి ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి 13 కేఎల్ సామర్ధ్యం సరిపోవడం లేదన్నారు. రోగులకు అవసరాలను తీర్చడానికే అదనంగా ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు.
లాలాగూడ్ సెంట్రల్ ఆసుపత్రి దక్షిణ మధ్య రైల్వేలో ప్రధానమైన ఆసుపత్రి అని, రైల్వే సిబ్బంది, విశ్రాంత రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్య అవసరాలను తీర్చడంలో కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. ఆసుపత్రిలో ఔట్ పేషంట్ సదుపాయమే కాకుండా 350 పడకల ఇన్ పేషంట్ వసతి కూడా ఉందని, కార్డియాలజీ, జనరల్ మెడిసెన్, జనరల్ సర్జరీ, ఓబీజీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, లాప్రోస్కోపిక్ సర్జరీలు, న్యూరో సర్జరీ, 24 గంటల డయాలసీస్, యూరాలజీ వంటి వ్యాధులకు చికిత్స అందజేస్తున్నట్లు వెల్లడించారు.
కొవిడ్ చికిత్స కోసం 250 పడకలను ఏర్పాటు చేశామని, వీటిలో 70 పడకలను హెచ్‌ఎఫ్‌ఎన్‌ఓ, బీఐపీఏపీ, వెంటిలేటర్ వసతితో ఇంటెన్సివ్ కేర్ చికిత్సకు కేటాయించినట్లు తెలిపారు. నేటివరకూ 4400 మందికిపైగా రోగులకు చికిత్స అందజేశామని, 263 మెడికల్, పారామెడికల్ సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అడిషినల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డా.ప్రసన్న కుమార్, హైదరాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రాయన్, లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డా.సి.కె.వెంకటేశ్వర్లు, రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.