ఏపీలో ఘోరం… ఆక్సిజన్ అందక 11 మంది మృతి..ఆరా తీసిన సీఎం జగన్

by srinivas |   ( Updated:2021-05-10 20:05:02.0  )
ఏపీలో ఘోరం… ఆక్సిజన్ అందక 11 మంది మృతి..ఆరా తీసిన సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి రుయా ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై ఆరా తీసిన జగన్ వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు నుండి వచ్చిన ఆక్సిజన్ ఆసుపత్రికి చేరుకునే సరికి 20 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో ఐసీయూలో కొవిడ్ చికిత్స పొందుతున్న పేషంట్లు కొందరు అపస్మారక స్థితిలోకి వెళిపోయారు. రియా ఆసుపత్రికి చేరుకున్న జిల్లాకలెక్టర్ హరినారాయణ్ పరిస్థితిని సమీక్షించి 11 మంది రోగులు ఆక్సిజన్ అందక మృతి చెందారని నిర్ధారించారు. అంతేకాకుండా పలువురు పేషెంట్ల పల్స్ పడిపోయినట్లు, మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన తెలిపారు. వైద్యులు వారిని కాపాడేందకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed