- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతులు తడిపితేనే ఆక్సిజన్ బెడ్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రిలో చేతులు తడిపితేనే కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందుతుంది. ఆక్సిజన్ కొరతతో ఆక్సిజన్ బెడ్లలో చికిత్సలు పొందుతున్న వారిలో 40శాతం పేషెంట్లకు మాత్రమే ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆక్సిజన్ అందించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక పేషెంట్ల అంటెండెంట్లు సిబ్బంది అడిగింనంతా డబ్బులు మట్టజెప్పాల్సి వస్తుంది. ఒక్కో పేషెంట్‌కు రూ.1000 నుంచి 2000 వరకు ఆక్సిజన్ అందించేందుకు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చుకోలేని పేషెంట్లు ఆక్సిజన్ కోసం నిస్సాహాయంగా ఎదురుచూస్తున్నారు.
ఆక్సిజన్ అందించడం ఆలస్యం కావడంతో పేషెంట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్నా.. ముందస్తుగా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది. హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో ఏర్పడిన పరిస్థితులే ఇందుకు ఉదాహరణగా చెప్పుకొవచ్చు. సిబ్బంది నిర్లక్ష్యంతో ఆక్సిజన్ అందక ఆదివారం కింగ్ కోఠి ఆసుపత్రిలో ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి చెందారు. కింగ్ కోఠి ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్సలు అందించేందుకు మొత్తం 350 బెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో అత్యధికంగా 300ల ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయగా 50 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు.
ఆక్సిజన్ బెడ్లలో 290 మంది పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా ఆసుపత్రికి చేరుకోవడంతో ఉదయం నుంచి ఆక్సిజన్ అందకపోవడంతో పేషెంట్లు చనిపోయారు. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్ర స్థాయిలో పనులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 115 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లను చికిత్సలు అందించేందుకు మొత్తం 15,380 బెడ్లను ఏర్పాటు చేశారు. రెగ్యూలర్ బెడ్లు 5,650 ఏర్పాటు చేయగా వీటిలో 1,349 మంది చికిత్సలు పొందుతున్నారు, ఆక్సిజన్ బెడ్లు 7,578 ఏర్పాటు చేయగా వీటిలో 5,086 మంది పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు. ఐసీయూ బెడ్లు 2,152 ఏర్పాటు చేయగా వీటిలో 1,575 మంది పేషెంట్లు చికిత్సలు పొందుతున్నారు. ఆక్సిజన్ బెడ్లలో చికిత్సలు పొందుతున్నవారందరికి ఆక్సిజన్‌ను అందించడంలో ఆసుప్రతి సిబ్బంది పూర్తిగా వైఫల్యం చెందింది.