- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆక్స్‌ఫర్డ్ టీకా రెండు డోసులు @1,000/-
న్యూఢిల్లీ: ట్రయల్స్ విజయవంతమైతే వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు వైద్యులకు, ఏప్రిల్‌లోపు వయోధికులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆక్స్‌ఫర్డ్ టీకాను ఉత్పత్తి చేస్తున్న పూణె సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఈ టీకా రెండు డోసుల(తప్పనిసరి)కు గరిష్టంగా రూ. 1,000 ఉండవచ్చునని చెప్పారు. 2024లోగా భారతీయులందరూ టీకా వేయించుకుని ఉంటారని అన్నారు.
ఓ మీడియా నిర్వహించిన సదస్సులో పూనావాలా మాట్లాడుతూ, ఆక్స్‌ఫర్డ్ టీకా రెండు డోసులకు సుమారుగా ఐదు లేదా ఆరు డాలర్లు (దాదాపు వెయ్యి రూపాయలు) ఉంటుంది. కానీ, పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తున్నందున ప్రభుత్వం వీటిని మూడు లేదా నాలుగు డాలర్లకే పొందవచ్చునని చెప్పారు. ఇతర టీకాల కంటే తమ టీకా చౌకగా అందించడానికే ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఈ టీకాలను రెండు నుంచి ఎనిమిది డిగ్రీల దగ్గరే సులువుగా నిల్వ చేసుకోవచ్చునని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ టీకా వయోజనుల్లోనూ సత్ఫలితాలనిచ్చిందని వివరించారు. ఎమర్జెన్సీ వినియోగానికి యూకే అథారిటీలు, యూరోపియన్ మెడిసిన్స్ ఎవల్యూషన్ ఏజెన్సీల ఆమోదం తర్వాత భారత్‌లో అందుకు దరఖాస్తు చేస్తామని వివరించారు.
జులైలోపు భారత్‌కు 40కోట్ల డోసులు అవసరం
జులైలోపు భారత్‌కు 40 కోట్ల డోసులు అవసరమని, అయితే, ఇవన్నీ సీరం నుంచే తీసుకుంటారన్న గ్యారంటీ లేదని పూనావాలా అన్నారు. ఈ మొత్తంతోపాటు కోవాక్స్ కూటమికి పదికోట్ల డోసులు అందించడానికి సిద్ధమవుతున్నామని వివరించారు. ఫిబ్రవరి నుంచి నెలకు పది కోట్ల డోసులను ఉత్పత్తి చేసే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారతే తమ తొలి ప్రాధాన్యత అని, అందుకే మిగతా దేశాలతో ఇప్పుడే ఒప్పందాలు చేసుకోవట్లేదని అన్నారు.