- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనందయ్యకు సొంత గ్రామస్థుల ఝలక్.. ఏమైందంటే..
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు షాక్ తగిలింది. ఆనందయ్య మందు పంపిణీని సొంత గ్రామస్థులే అడ్డుకుని ఝలక్ ఇచ్చారు. ఎలాంటి లైసెన్సు లేకుండా మందు ఎలా పంపిణీ చేస్తారంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ప్రశ్నించారు. ఆనందయ్య వల్ల గ్రామాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోకి బయటి వ్యక్తులు రావడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని ఫలితంగా చిన్న పిల్లలు అనారోగ్యానికి గురై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని ప్రజలు ఆరోపించారు. ఆనందయ్య మందు పంపిణీ ఆపాల్సిందేనని గ్రామస్థులంతా ఏకమై ఆయన ఇంటి వద్దకు వచ్చారు.
గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు సైతం ఆనందయ్య ఇంటి వద్దే పంచాయతీ ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీలో గ్రామస్థులు ఆగ్రహంతో ఆనందయ్యపై మండిపడ్డారు. అనుమతి లేని మందు పంపిణీ కుదరదంటూ గ్రామస్థులు మొత్తం ఆనందయ్యను ఓ దశలో చుట్టుముట్టారు. మందు పంపిణీనీ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆనందయ్య ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆనందయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మందు పంపిణీ ఆపితేనే తాము ఇంటికి వెళ్తామని గ్రామస్థులు భీష్మించుకుకూర్చున్నారు. దీంతో ఆనందయ్య ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.