47 డిగ్రీలు దాటిన ఎండ వేడి

by Shyam |
47 డిగ్రీలు దాటిన ఎండ వేడి
X

దిశ, న్యూస్ బ్యూరో:
ఈసారి వేసవికాలంలో లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో పెద్దగా ఎండ వేడి తెలియలేదు. కానీ గడచిన నాలుగైదు రోజులుగా క్రమంగా ఉష్ణోగ్రత పెరుగుతోంది. జగిత్యాల జిల్లా ఎండపల్లి రాజారాంపల్లిలో గరిష్ట స్థాయిలో 47.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఇదే జిల్లాలోని ధర్మపురిలో 47 డిగ్రీలు, నేరెళ్ళలో 46.8, కొత్తగూడెం జిల్లా పెంట్లాంలో 46.8, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో 47, మంచిర్యాల జిల్లా జన్నారంలో 46.9, నల్లగొండ జిల్లా హాలియాలో 46.8, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 46.7, పెద్దపల్లి జిల్లా మంథనిలో 46.7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇ-బయ్యారంలో 46.5, భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లిలో 46.4 డిగ్రీల చొప్పున ఎండ వేడి నమోదైంది. రానున్న నాలుగైదు రోజుల పాటు జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, భూపాలపల్లి, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట జిల్లాలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలో సైతం దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బండ్లగూడ సమీపంలోని కందికల్ గేటు ప్రాంతంలో 44.4 డిగ్రీలు, కుత్బుల్లాపూర్‌లో 44.4 డిగ్రీలు నమోదైనట్లు తెలిపింది.

Advertisement

Next Story