దేశంలో ఆ వాహనాల సంఖ్య తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Shamantha N |
దేశంలో ఆ వాహనాల సంఖ్య తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో 15 ఏళ్ల కంటే ఎక్కువ పాతబడిన వాహనాలు 4 కోట్లకు పైగా ఉన్నాయని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా తెలిసింది. ఈ వాహనాలన్ని కేంద్ర తాజాగా ప్రతిపాదించిన ‘గ్రీన్ ట్యాక్స్’ పరిధిలో ఉన్నవే. వివిధ రాష్ట్రాల వాహనాలను గణాంకాలను డిజిటలైజ్ చేస్తున్న క్రమంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వీటిలో 2 కోట్లకుపైగా వాహనాలు 20 ఏళ్లకు మించినవని స్పష్టమైంది. ఇక, అత్యధికంగా పాత వాహనాలను కలిగిన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఈ రాష్ట్రంలో ఏకంగా 70 లక్షల కంటే ఎక్కువ పాత వాహనాలున్నాయి. తర్వాతి స్థానంలో 56.54 లక్షల పాత వాహనాలతో ఉత్తరప్రదేశ్ ఉండగా, 59.93 లక్షల వాహనాలతో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.

ఇటీవల పర్యావరణాన్ని రక్షించేందుకు గానూ, పాతవాటిని పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కాలుష్యాన్ని సృష్టించే పాత వాహనాలపై ‘గ్రీన్ ట్యాక్స్’ విధించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా గణాంకాలతో దేశంలో ఎన్ని పాత వాహనాలు ఉన్నాయో స్పష్టమైంది. ఇప్పటికే ‘గ్రీన్ ట్యాక్స్’కు సంబంధించి రాష్ట్రాలకు ప్రతిపాదనలు కేంద్రం ఇచ్చింది. ఈ కొత్త ట్యాక్స్ ద్వారా వచ్చిన నిధులను కాలుష్యాన్ని తగ్గించేందుకు వినియోగించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రికార్డులు అందుబాటులో లేని కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ రాష్ట్రాల గణాంకాలు ఇందులో చేర్చలేదు. కాగా, ‘గ్రీన్ ట్యాక్స్’ నుంచి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్, సీఎన్‌జీ లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచేవి, వ్యవసాయ రంగంలో వాడే ట్రాక్టర్ సహా పలు వాహనాలకు మినహాయింపు ఇచారు.

Advertisement

Next Story

Most Viewed