మారణహోమం.. 30 మందిని చంపి, వాహనాల్లో డెడ్ బాడీలు వేసి.. (వీడియో)

by Anukaran |   ( Updated:2021-12-25 23:20:23.0  )
మారణహోమం.. 30 మందిని చంపి, వాహనాల్లో డెడ్ బాడీలు వేసి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : మయన్మార్‌లో సైనిక పాలన అకృత్యాలు వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా కయాహ్ రాష్ట్రం మోసో గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సైన్యం మారణహోమం సృష్టించింది. ప్రాణ భయంతో శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్న 30 మందిని మయన్మార్‌ సైన్యం దారుణంగా హతమార్చింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉండటం గమనార్హం.

వివరాల ప్రకారం.. సైనిక పాలన నేపథ్యంలో మయన్మార్‌ ప్రజలు భారీ సంఖ్యలో పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌కు తరలిపోతున్నారు. అయితే, మోసో గ్రామ సమీపంలో మయన్మార్ సైనికులకు, అక్కడి సాంప్రదాయ గెరిల్లా సాయుధులకు మధ్య భీకర ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలోనే గ్రామస్థులు శరణార్థ కేంద్రానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో సైనికులు వారిని అరెస్టు చేశారు. చిన్నారులు ఉన్నారన్న దయ కూడా చూపించుకుండా అనంతరం వారందరినీ కాల్చి చంపారు. ఆ తర్వాత మృతదేహాలకు తాళ్లు కట్టి వాహనాల్లో పడేసి నిప్పంటించారు. వారి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా దహనమయ్యాయి. ఈ క్రమంలో 7 వాహనాలను సైనిక బలగాలు దగ్ధం చేశాయి.

Advertisement

Next Story