ఇప్పటివరకు 3 కోట్ల ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు!

by Harish |
tax
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 3 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా దాఖలు చేయని వారెవరైనా ఉంటే వీలైనంత తొందరగా రిటర్నులను దాఖలు చేయాలని సూచించింది.

రోజుకు 4 లక్షల రిటర్నులు దాఖలవుతున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2020-21 అసెస్‌మెంట్ ఏడాది రిటర్నుల దాఖలుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉందని వెల్లడించింది. ఇంకా దాఖలు చేయనివారి కోసం ఆర్థిక శాఖ పన్ను చెల్లింపులదారులకు మెయిల్, మెసేజ్, ఇంకా ఇతర విధానాల్లో సమాచారం చేరవేస్తోందని వివరించింది. చివరి నిమిషం వరకు ఉంటే గందరగోళం ఏర్పడుతుందని, ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా రిటర్నులను దాఖలు చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది.

అలాగే, ఈ-ఫైలింగ్ పోర్టల్ నుంచి రిటర్నులను దాఖలు చేసే సమయంలో ఫారమ్ 26ఏఎస్, యాన్యూవల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్(ఏఐఎస్) సహా ఇతర పత్రాలను సరిచూసుకోవడం మంచిదని సూచించింది. కాగా, ఇప్పటివరకు దాఖలైమ మొత్తం అన్ని రిటర్నుల్లో 52 శాతం ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా జరిగాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story