మోడీ, ట్రంప్‌లకు 10వేలమంది పోలీసుల భద్రత..

by Shamantha N |
మోడీ, ట్రంప్‌లకు 10వేలమంది పోలీసుల భద్రత..
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24నుంచి రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా మోడీ, ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌లు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మొటెరా స్టేడియం వరకు మొత్తం 22కిలోమీటర్ల పాటు రోడ్‌షోలో పాల్గొననున్నారు. ఈ రోడ్‌షోలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా 25మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో 10వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రత కల్పించనున్నారు. అంతేకాకుండా, 65మంది అసిస్టెంట్ కమిషనర్లు, 200మంది ఇన్‌స్పెక్టర్లు, 800మంది ఎస్సైలు అదనంగా విధులు నిర్వహించనున్నారని డీసీపీ విజయ్ పటేల్ వెల్లడించారు.

Advertisement

Next Story