- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ సర్కార్ చేసిన పనికి.. మనోవేదనతో వర్క్ ఇన్‌స్పెక్టర్ మృతి
దిశ ప్రతినిధి, మెదక్ : తెలంగాణ గృహ నిర్మాణ సంస్థలో ఔట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న వ్యక్తి అకాల మరణం చెందారు. ఆదివారం మృతుని స్నేహితులు, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన తొంటొళ్ళ ఎల్లయ్య తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశాడు.
2006 సంవత్సరం నుంచి 2016 మార్చి వరకు తొగుట, మిరుదొడ్డి, నంగునూర్, మెదక్ మండలంలో పని చేశాడు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. గృహ నిర్మాణ సంస్థలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌లను తొలగించింది. అప్పటి నుంచి సరైన ఉపాధి లేక, కుటుంబ పోషణ భారమైంది. గత ఐదు సంవత్సరాల నుంచి ఉపాధి లేక తీవ్ర మనోవేదనకు గురై మరణించారని తెలిపారు.
ఆయన మృతికి తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు, తోటి స్నేహితులు జింక సంజీవ్, సుంచు శ్రీనివాస్, రేణిగుంట బాబు, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, మహేందర్, నర్సింహా చారి, ఇర్ఫాన్‌లు నివాళ్ళర్పించారు.