దేశం ‘చురు’క్కుమంటోంది!

by Shamantha N |
దేశం ‘చురు’క్కుమంటోంది!
X

గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్ 15 ప్రాంతాల్లో.. భారత్‌కు చెందినవే పది ఉన్నాయి. ప్రముఖ వాతావరణ పర్యవేక్షణా వెబ్‌‌సైట్ ‘ఎల్ డురాడో’ నివేదిక ప్రకారం.. మంగళవారం దేశంలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై, రాజస్థాన్‌లోని ‘చురు’ అనే ప్రాంతం మొదటిస్థానంలో నిలిచింది. థార్ ఎడారికి ముఖద్వారంగా ఉండే ఈ చురు ప్రాంతం తర్వాత పాకిస్థాన్‌లోని జాకోబాబాద్ నిలిచింది.

అలాగే రాజస్థాన్‌లోని బికనీర్, గంగానగర్, పిలానీ ప్రాంతాలు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. వీటితోపాటు ఉత్తరప్రదేశ్‌లో 2 ప్రాంతాలు, మహారాష్ట్రలోని 2 ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. హర్యానాలోని హిస్సార్, బందా ప్రాంతాల్లో 48 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జాబితా ప్రకారం న్యూఢిల్లీల్లో 47.6 డిగ్రీలు, బికనీర్‌లో 47.4 డిగ్రీలు, గంగానగర్‌లో 47 డిగ్రీలు, ఝాన్సీలో 46 డిగ్రీలు, పిలానిలో 46.9 డిగ్రీలు, నాగ్‌పూర్ సోనేగావ్‌లో 46.8 డిగ్రీలు, అకోలాలో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు రికార్డయినట్టు ఎల్ డురాడో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed