- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ‘స్వయంవరం’ హీరో వేణు..
దిశ, సినిమా: అలనాటి నటుడు వేణు గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇన్నేళ్లకు వేణు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ టైమ్ హారర్ కథాంశంతో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. ‘అతిథి’ టైటిల్ తో రాబోతున్న ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను బుధవారం రిలీజ్ చేశారు మేకర్స్. ఓ పురాతన భవనం నేపథ్యంలో ఈ హారర్ సిరీస్ సాగనుంది. వర్షంలో ఈ భవంతిలోకి అడుగుపెట్టిన ఓ యువతి రాత్రి పూట ఇక్కడ ఉండొచ్చా అని అడగటం ఈ టీజర్‌లో కనిపిస్తోంది. ఇక ఈ వెబ్‌సిరీస్‌లో వేణుతోపాటు అవంతికా మిశ్రా ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. కాగా ఈ సిరీస్‌కు దర్శకుడు ఎవరన్నది మేకర్స్ రివీల్ చేయలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.