Kushi OTT: ‘ఖుషి’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పటినుంచో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-09-01 14:49:38.0  )
Kushi OTT: ‘ఖుషి’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పటినుంచో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత, విజయ్ దేవరకొండ కలిసి జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ మూవీకి మొత్తానికి హిట్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. తాజాగా, ‘ఖుషి’ డిజిటల్ హక్కులు ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. ఓటీటీ హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడగా భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. కొత్త సినిమాలు దాదాపు నెల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే ఖుషి సినిమా కూడా నెల తర్వాత అక్టోంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

ఆ విషయంలో రౌడీ హీరోను మార్చేసిన సమంత.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha-Vijay Devarakonda ‘Kushi’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. హిట్టా ఫట్టా?

Advertisement

Next Story