- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలో విడుదలై వారం కాకముందే.. ‘యానిమల్’ మూవీని వెంటనే తొలగించాలంటూ పోస్టులు
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. దీనిని స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 1న థియేటర్స్‌లో విడుదలై భారీ విషయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఇందులోని సీన్స్ వల్ల విమర్శలు ఎదుర్కున్నప్పటికీ సినిమా మాత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న యానిమల్ ఓటీటీలోకి వచ్చింది.
ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన నాలుగు రోజులకే ఈ సినిమాను తొలగించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పలు ట్వీట్లు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇందులోని కొన్ని సీన్లు భారతీయ మహిళలను కించపరిచేలా ఉన్నాయి. అలాగే వివాహ బంధాలపై వ్యతిరేకత చూపించే విధంగా ఉంది. అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టగా.. మరికొంతమంది దీనిని సంప్రదాయాలను డిస్టబ్ చేసేలా ఉంది. ఒక్క పురుషుడికి ఒక భార్య అనే కాన్పెప్ట్‌ను మార్చేలా కనిపిస్తుంది. అని రాసుకొచ్చాడు. చూడాలి మరి వాటిపై నెట్‌ఫ్లిక్స్ స్పందిస్తుందా లేదా అనేది.