ఓటీటీలోకి రానున్న ‘ఖుషి’.. విజయ్-సమంత ఆ సీన్స్‌తో మరింత బోల్డ్‌గా స్ట్రీమింగ్!

by Hamsa |   ( Updated:2023-09-25 03:19:21.0  )
ఓటీటీలోకి రానున్న ‘ఖుషి’.. విజయ్-సమంత ఆ సీన్స్‌తో మరింత బోల్డ్‌గా స్ట్రీమింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, యంగ్ హీరో విజయ్ దేవరకొండ కలిసి జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. దీనికి శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన విడుదలై మొదటి షోతోనే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇన్నాళ్లు థియేటర్స్‌లో మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. డిజిటల్ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరికి ఖుషి రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 1న ఖుషి సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అసలు విషయం ఏమిటంటే ఇందులో నిడివి కారణంగా కట్ చేసిన కొన్ని సన్నివేశాలు కూడా యాడ్ చేశారు. అంతేకాకుండా సమంత- విజయ్ కలిసి నటించిన రొమాంటిక్ సీన్స్ కూడా ఓటీటీలో చూపించబోతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story