పెళ్లి పీటలు ఎక్కిన స్టైలిష్ విలన్

by Sridhar Babu |   ( Updated:2023-06-25 15:11:38.0  )
పెళ్లి పీటలు ఎక్కిన స్టైలిష్ విలన్
X

దిశ, వెబ్​డెస్క్​ : గోపీచంద్ హీరో గా వచ్చిన జిల్ సినిమా తో విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన కబీర్ దుహన్ సింగ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి స్టైలిష్ విలన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ విలన్ తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా నటించి విలన్ గా మంచి పేరు సొంతం చేసుకున్నాడు. ఈ స్టైలిష్ విలన్ కబీర్ దుహన్ సింగ్ ఓ ఇంటివాడు అయ్యాడు. ఢిల్లీ లో సీమ చాహల్ ని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు మరియు మిత్రులు హాజరు అయ్యారు. సీమ చాహల్ తో కబీర్ దుహన్ సింగ్ వివాహం గురించి కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. సీమ చాహల్ తో కబీర్ దుహాన్ సింగ్ పెళ్లి ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. హర్యానా లోని ఫరీదాబాద్ లో పుట్టి పెరిగిన కబీర్ దుహాన్ సింగ్ ఎన్నో ఫ్యాషన్ షో ల్లో మోడల్ గా కనిపించాడు.

Also Read: విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్?

Advertisement

Next Story