- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ OTT లోకి వచ్చేసింది.. దేనిలో చూడొచ్చంటే?
దిశ,వెబ్ డెస్క్: కొన్నేళ్ల క్రితం మదనపల్లె పట్టణంలో జరిగిన సామూహిక హత్యల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ సూసైడ్. ఈ మూవీలో హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషించింది. విప్లవ్ కొనేటి దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకున్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నేటి నుంచి స్ట్రీమ్ కానుంది. 'చావును శాసించడం సాధ్యమా? మాట్లాడుకుందాం. ఈ అసాధారణమైన ప్రశ్నకి సమాధానం ఈ రాత్రి నుండి ..అన్ని విషయాలు మాట్లాడుకుందాం.' అంటూ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్‌డేట్స్‌ను షేర్ చేసింది ఆహా. ఈ మూవీలో ఎవరూ ఊహించని ట్విస్టులు, సస్పెన్స్, డ్రామా, రొమాన్స్.. ఇలా అన్నీ ఉన్నాయి. ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది.
ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుంటే.. కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బళ్లారి నీలకంఠం (నరేశ్) యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్ కి తీసుకెళ్లిన ప్రయోజనం ఉండదు. అయితే ఎలాగైనా ఆయనను తిరిగి బతికించాలని హెబ్బా పటేల్‌తో సహా ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు. ఆయనను ప్రేమించే వారు ప్రాణ త్యాగం చేస్తే మళ్లీ ఆయన తిరిగి వచ్చే అవకాశముందని బలవన్మరణానికి సిద్ధపడతారు. అయితే హెబ్బాను లవ్ చేసిన రామ్ కార్తీక్ ఈ పనికి ఒప్పుకోడు. చివరకు అతనికి కూడా మాయ మాటలు చెప్పి నమ్మిస్తారు. వాళ్లు ఆ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్నది ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు? అనేది తీసుకున్నారో తెలుసుకోవాలంటే ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ ను ఒకసారి చూడాల్సిందే.