- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ బీజేపీ వైపు పొరుగు రాష్ట్రాలు చూపు
దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ బీజేపీ వైపు పొరుగు రాష్ట్రాలు చూస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అతలాకుతలం అవుతున్న బాధితులకు బాసటగా నిలిచేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతోంది తెలంగాణ బీజేపీ. కొవిడ్ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి, కరోనా బాధితులకు తనవంతు సాయం అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 9 వేల మందికి రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందించింది.
స్పెషల్ మానిటరింగ్…
కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో బెడ్ల ఏర్పాటు, చికిత్స అందించే విధానం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేక దృష్టి సారించారు. కొవిడ్ హెల్ప్ డెస్క్ ద్వారా ఎప్పటికప్పుడు కరోనా బాధితులకు సేవలందించేందుకు ప్రత్యక చొరవ తీసుకుంటున్నారు.
బ్లాక్‌కు చెక్ పెట్టేందుకు…
మొదట్లో బీజేపీ ఆధ్వర్యంలో రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారు. నేరుగా ఇచ్చే ఈ విధానంతో బ్లాక్ మార్కెట్ గాళ్లు కూడా తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని గుర్తించారు. దీంతో ఆయా జిల్లా కమిటీల అధ్యక్షుల ద్వారా మాత్రమే ఈ ఇంజక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే కొవిడ్ పేషెంట్ ఆధార్ కార్డు, హాస్పిటల్ ద్వారా లెటర్ తీసుకుని వచ్చిన వారికే ఎమ్మార్పీ ధరకు రెమిడెసివిర్ అందించే విధానాన్ని చేపట్టారు. కరోనా సోకిన బీజేపీ కార్యకర్తలకు మాత్రం పూర్తి ఉచితంగా ఇస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల నుండి…
తెలంగాణలో అందిస్తున్న ఈ సేవలను తెలుసుకున్న కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఇటువైపు దృష్టి మరల్చాయి. ఇక్కడ అందిస్తున్న సేవలు ఆదర్శంగా ఉన్నాయని తమ రాష్ట్రానికి చెందిన కరోనా బాధితులకు కూడా సాయం అందించేందుకు చొరవ చూపాలని ఆయా రాష్ట్రాల నాయకులు తెలంగాణ బీజేపీ చీఫ్ ను కోరారు. వారికి కూడా తమ వంతు సాయం రాష్ట్ర కమిటీ అందిస్తుండడం విశేషం.
వద్దన్న వినకుండా…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరోనా బాధితులకు అందుతున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. పలు ఆసుపత్రుల్లోని కొవిడ్ వార్డులను, ఐసోలేషన్ కేంద్రాలను ప్రత్యక్ష్యంగా పరిశీలించి బాధితులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. అయితే గతంలోనే అనారోగ్యానికి గురై ప్రాణాపాయం నుండి బండి సంజయ్ బయటపడ్డారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పలువురు వైద్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించినా ఆయన మొండిగానే ముందుకు సాగుతున్నారు.