- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
దిశ ప్రతినిధి , హైదరాబాద్:
అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలను ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు కాపాడారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను ఉస్మానియా ఆస్పత్రిలో మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వెల్లడించారు. డాక్టర్ నాగేందర్ తెలిపిన వివరాల ప్రకారం… కామారెడ్డి టేక్రియాల్ కు చెందిన లావణ్య30)కు పదేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐతే ఆమెకు పుట్టుకతో ఉన్న లోపం కారణంగా జీర్ణాశయంలోని అవయవాలు ఎడమ వైపు చాతిలోకి వచ్చాయి. దీంతో గుండె కొంత మేర కుడి వైపుకు జరిగి తరచుగా అనారోగ్యానికి గురయ్యేది. సుమారు నెల రోజులుగా సమస్య జఠిలంగా మారింది. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఈ నెల 5న ఉస్మానియా ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చింది. కాగా పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె లోపాన్ని డాక్టర్లు గుర్తించారు. సమస్యను సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ నెల 10న ఆయన ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం శస్త్ర చికిత్స నిర్వహించి ఆమె ప్రాణాలను కాపాడింది. కాగా శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ప్రశంసించారు.