యాక్సిడెంట్లు జరగడానికి కారణం ఇదే : OSD శరత్ చంద్ర పవార్

by Aamani |
OSD Sharath Chandra Pawar
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్ స్టేషన్ ప్రాంతంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతోన్న ప్రాంతాలను ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మానవ తప్పిదం, అతివేగం, అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం వల్ల తరచుగా యాక్సిడెంట్‌లు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

HKR, R&B, పంచాయతీ రాజ్ అధికారులను సమన్వయం చేసుకొని ప్రమాదం జరిగిన బ్లాక్ స్పాట్స్ వద్ద ధర్మో ప్లాస్టిక్ పెయింట్స్, రేడియం స్టెడ్స్, బ్రింగ్ లెటర్స్, సైనింగ్ బోర్డ్స్, వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాల నివారణ గురించి ప్రతి రోజు స్పీడ్ లేజర్ గన్‌తో తనిఖీలు చేసి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించిన వారికి, అతి వేగంగా వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ నరేందర్, సీఐ రాజు, ఎస్ఐ మంగీలాల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed