- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాటిన మొక్కలను సంరక్షించాలి : ప్రియాంక
by Shyam |
X
దిశ, మేడ్చల్: హరితహారంలో భాగంగా అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి కొంపల్లి నుంచి మేడ్చల్ వరకు ఎన్‌హెచ్ హైవేపై 15కిలోమీటర్ల పరిధిలో హరితహారంలో నాటిన మొక్కలను ఆమె గురువారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… రోడ్లకు ఇరువైపులా పెద్ద ఏవెన్యూ ప్లాంటేషన్ చేయాలని కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, మేడ్చల్ మున్సిపల్ కమిషనర్లను అదేశించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు గుంతలు తవ్వి, ఎర్రమట్టి, సాసరింగ్ చేసి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story