- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరొంచ ‘మ్యాన్’గో.. సిత్రాల తీపి
దిశ, కరీంనగర్: ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త కాదు.. అగ్రికల్చర్‌లో డిగ్రీ అంతకన్నా లేదు.. అందరిలా ఆయనో సాధారణ రైతు మాత్రమే.. అయితేనేం ఆయనలోని క్రియేటివిటీకీ ఇవేమీ అడ్డుకాలేదు. తన స్వయం కృషే సమాజానికి సరికొత్త మామిడి రకాలను అందించింది. ఇందుకు తన సువిశాలమైన మామిడి తోటనే పరీక్షా కేంద్రంగా మార్చుకుని.. అంటు మొక్కల విధానంతో కొత్త రకం మామిడి వంగడాలను
సృష్టించి అందరికీ ఆదర్శంగా నిలవగలిగారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, సిరొంచ పొలిమేరల్లోని గల వ్యవసాయ క్షేత్రంలోని మామిడి రకాలన్నీ కూడా అత్యంత అరుదైనవి. కొండ్ర విశ్వేశ్వర్ రావు అనే రైతుకు చెందిన ఈ తోటలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అరుదుగా లభించే మామిడి రకాలను కూడా పెంచుతున్నారు. ఇక్కడ లభించే ఒక అరుదైన రకం గురించి పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉండటం గమనార్హం. ‘రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్లినప్పుడు, ఆమె అక్కడి ఆహారం ముట్టనని శపథం చేశారట. ఆ సమయంలో లంకలో పనిచేస్తున్న కొందరు సీతమ్మకు మామిడి పళ్లను ఇస్తే తాను తినని విసిరేశారట. అప్పుడు వారు.. సీతతో అమ్మా.! తాము తమిళ ప్రాంతానికి చెందిన వారమని, అక్కడి నుంచి వచ్చి ఈ లంకలో పనిచేస్తున్నామని, ఈ మామిడి కాయలు అక్కడి నుండే తీసుకొచ్చామని చెప్పారట. అప్పుడు సీత ఆ మామిడి కాయలు తినడంతో వాటికి ‘సీతాక షహెనీ’ అని పేరొచ్చిందని ప్రసిద్ధి. ఈ రకంతో పాటు.. అతి చిన్న సైజులో ఉండే మామిడి కాయలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. అత్యంత పులుపు రకం నుంచి అధిక తీపి ఉండే మామిడి వరకు అన్నీ ఇక్కడ లభిస్తాయని కొండ్ర విశ్వేశ్వర్ రావు తెలిపారు. తన ఆలోచనలతో తయారు చేసిన పలు మామిడి రకాలకు రాష్ట్రపతి, హోమ్ మినిస్టర్, కలెక్టర్, సర్పంచ్.. ఇలా వివిధ రకాల పేర్లు కూడా పెట్టినట్టు వివరించారు. ఆర్‌ఆర్ పాటిల్ మహారాష్ట్ర హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు తమ తోట నుంచి మామిడి పళ్ళను ప్రత్యేకంగా తెప్పించుకునే వారని చెప్పారు. ఆయన గుర్తుగా తాను తయారు చేసిన ఓ అంటు మెక్కకు హోమ్ మినిస్టర్ అని నామకరణం చేశానన్నారు. వింత ఆకారంలో వచ్చిన ఓ మామిడి మొక్కకు సర్పంచ్ అని.. భారీ సైజులో కాసిన మామిడికి రాష్ట్రపతి అని ఇలా వెరైటీగా పేర్లు పెట్టినట్టు వెల్లడించారు.
ఈ తోటలో ఉండే తీపిరకం మామిడి కాయల రసాన్ని పిండి చక్కెర కలుపుకోకుండా తాగినా ఎంతో మధురంగా ఉంటుందంటేనే.. ఆ అంటు మెుక్కలను తయారు చేయడంలో ఆయన స్పెషాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ తోటకు మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్. అక్కడ ఏపుగా పెరిగిన చెట్లకు, కొత్తగా తయారవుతున్న అంటు మొక్కలకు ఎరువులు, పురుగు మందులు ఆయన అస్సలు వాడరు. కేవలం సేంద్రీయ పద్ధతిలోనే మామిడి తోటలను పెంచుతూ.. విలక్షణ శైలిలో అంటు మొక్కలను క్రియేట్ చేస్తున్నారు. కాళేశ్వరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ తోటను చూడాలంటే.. అక్కడ కొండ్రా వార్ మామిడి తోట ఎక్కడ అని అడిగితే ఎవరైనా ఠక్కున చెప్పేస్తారంటేనే.. ఆ ప్రాంతంలో ఈ తోట ఎంత ఫేమసో అర్థం చేసుకోవచ్చు.
Tags : Mango Farm, Kaleshwaram, Konda Vishweshwar rao, Sita ka shehani, Organic