మృతుల కుటుంబాలను ఆదుకోవాలి : ఉత్తమ్

by Shyam |
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి : ఉత్తమ్
X

దిశ, న్యూస్‌బ్యూరో : రాష్ట్రంలో (కొవిడ్-19) కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై విపక్ష పార్టీల ముఖ్యనాయకులు గురువారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌తో చర్చించచారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కొవిడ్-19 టెస్టులు వేగవంతంగా జరుగుతుండగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రమే వెనకబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని టెస్టుల్లో వేగం పెంచాలని సూచించారు. కరోనాతో మరణించిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు.

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. బతుకు దెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలసబోయిన కార్మికులను తీసుకురావాలని, చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలన్నారు. కరోనా నియంత్రణ కోసం సీఎం సహాయ నిధికి వచ్చిన నిధుల లెక్కలు తెలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పీహెచ్‌సీ కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రులను పునరుద్ధరించాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు జోక్యం చేసుకోవడం తగదన్నారు.

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం ను వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైయివేట్ వాహనాల పన్నులు 3 నెలల పాటు రద్దు చేయాలన్నారు. ధాన్యం దళారులు కొనుగోలు చేస్తున్నారో..ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. తాలు, తేమ శాతం పేరుతో కిలోలకు.. కిలోలు కోతలు విధించడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags: Uttam, Chief Secretary, Somesh Kumar, Kodandaram, L.Ramana, Venkat Reddy

Advertisement

Next Story