పోలీసుల కాళ్లు పట్టుకొని వేడుకున్న సొసైటీ ఉపాధ్యక్షుడు

by Shyam |
Opposition parties protest
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగడం లేదని అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు మూడు గంటలపాటు భారీ ధర్నాచేసి రాస్తారోకో నిర్వహించారు. గురువారం కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై రైతుల ధర్నా కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వరి కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. రోజులు తరబడి రైతులు వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారని, దీనివల్ల వారు మనోవేధనకు గురవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. అఖిలపక్ష నేతలను అక్కడినుంచే తరలించే ప్రయత్నం చేస్తుండగా, ఎల్లారెడ్డి సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్ పోలీసులు కాళ్లు పట్టుకొని వడ్ల కొనుగోలు పూర్తయ్యేలా చూడాలని వేడుకోవడం అక్కడ ఉన్నవారిని సైతం కలిచివేసింది. రైతులు పడుతున్న ఆవేదన అతడిని కలిచివేసింది. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకురాలు జామున రాథోడ్, బీజేపీ నాయకుడు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed