కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్-19 నివారణలో కేంద్ర, రాష్ట్రాలు విఫలం అయ్యాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వానికి వినతులు, విజ్ఞాపన పత్రాలు అందజేసే సమయం దాటిపోయిందని, కలిసికట్టుగా ఐక్య పోరాటానికి ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈనెల 27న వర్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం, ఆగస్టు 2న రచ్చబండ పేరిట వర్చువల్ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. కలిసొచ్చే అన్ని పార్టీలతో పాటు, ప్రజా, కుల, వృత్తి సంఘాలను ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామని వెల్లడించాయి. హిమాయత్‌నగర్ మగ్ధుం భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, తమ్మినేని వీరభద్రం, టీడీపీ అధ్యక్షులు ఎల్. రమణ పాల్గొన్నారు. కరోనాపై కేసీఆర్ ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యంగా ఉందన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మరో 6 నెలల వరకు పేద కుటుంబాలకు రూ.7500ల ఆర్థిక సాయం చేయాలని, అలాగే 12 కిలోల రేషన్‌తో పాటు అన్ని నిత్యావసర వస్తువులను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story