- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేను హామీ ఇస్తున్నా.. త్వరలోనే : స్పీకర్ పోచారం
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసరుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో రూ. 2.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇళ్ళను శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కులం, మతం, రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని గూడు లేని పేద వారందరికీ సొంత ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో అన్ని వసతులతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తుందని, నియోజకవర్గ పరిదిలోని 110 గ్రామాలలో 5 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ భగీరధ ప్రయత్నమని స్పీకర్ అన్నారు. జూలై ఆఖరి నాటికి కొండపోచమ్మ సాగర్ ద్వారా, వచ్చే ఏడాది నాటికి మల్లన్న సాగర్ ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయని సభాపతి హామీ ఇచ్చారు. రూ. 17 కోట్లతో 100 పడకల సామర్థ్యంతో బాన్సువాడ పట్టణంలో మాతా శిశు ఆసుపత్రిని నిర్మిస్తున్నామని.. త్వరలో ఆ పనులు పూర్తవుతాయన్నారు. బొమ్మన్ దేవ్ పల్లి చౌరస్తా నుంచి గ్రామంలోకి రూ. 2.25 కోట్లతో నూతనంగా మరింత సామర్థ్యంతో బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని.. త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.