గాంధీలో ఓపీ సేవలు బంద్.. ఓన్లీ కరోనా ట్రీట్మెంట్

by Shyam |   ( Updated:2021-04-16 07:41:51.0  )
గాంధీలో ఓపీ సేవలు బంద్.. ఓన్లీ కరోనా ట్రీట్మెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కరోనా హాస్పిటల్‌గా మారుస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం నుంచి అన్ని ఓపీ (ఔట్ పేషెంట్) కన్సల్టేషన్లను నిలిపివేయాలని స్పష్టం చేసింది. అత్యవసరం కాని సర్జరీను తక్షణం నిలిపివేయాలని, ఇప్పటికే తేదీలు ప్రకటించిన కేసుల విషయంలో కొత్త తేదీలను ఖరారు చేయాలని స్పష్టం చేసింది. కరోనా పరిస్థితి సద్దుమణిగే వరకు గాంధీ ఆస్పత్రిలో కరోనా కేసులు తప్ప ఇతర కేసులు ఉండవని స్పష్టం చేసింది.

గడచిన వారం పది రోజుల్లో ప్రతీ పది నిమిషాలకు ఒక కొత్త పేషెంట్ అడ్మిట్ అవుతున్నారు. గురువారం ఒక్కరోజే 150 మంది అడ్మిట్ అయ్యారు. ఇన్ పేషెంట్ బ్లాకులన్నీ కరోనా పేషెంట్ల కోసమే కేటాయించాల్సి వస్తోంది. ప్రస్తుతం ‘గాంధీ‘లో ఉన్న ఎమర్జెన్సీ పేషెంట్లను ఇతర ఆస్పత్రులకు షిప్టు చేసే ప్రక్రియ మొదలుకానుంది. కరోనా క్రిటికల్ కేసులన్నీ ఇకపైన ‘గాంధీ‘కే రిఫర్ చేసేలా వివిధ సర్కారు ఆస్పత్రులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed